'పెద్ది' సినిమా అప్డేట్.. రత్నవేలు స్పెషల్ పోస్ట్

  • షూటింగ్ పూర్తయినట్లు తెలిపిన రత్నవేలు
  • చెర్రీతో కలిసి చేసిన ఈ ప్రయాణం ఎప్పటికీ మరువలేనిద‌ని భావోద్వేగ పోస్ట్ 
  • చరణ్ తో కలిసి పనిచేయడం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అన్న సినిమాటోగ్రాఫర్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ పూర్తయింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ ముగిసినట్లు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో రామ్ చరణ్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు.

"పెద్ది సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ ప్రయాణం ఎప్పటికీ మరువలేనిది. ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం" అని రత్నవేలు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

రామ్ చరణ్ నటనను, వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ.. "తెరపై అద్భుతమైన నటనతో అదరగొట్టే ఆయన, తెర వెనుక ఒక గొప్ప స్నేహితుడు. మేమిద్దరం కలిసి సృష్టించుకున్న ఈ జ్ఞాపకాలకు ఎంతో కృతజ్ఞుడిని" అని రాసుకొచ్చారు. 

రత్నవేలు పోస్ట్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'పెద్ది' ఒకటి కాగా, తాజా అప్డేట్ తో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. చిత్రీకరణ పూర్తికావడంతో త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం కానున్నాయి.

Peddi
Ram Charan
shooting wrapped
cinematographer
Rathnavelu

More Telugu News